VIDEO: స్పీకర్ ఆదేశాలతో రోడ్లకు మరమ్మతులు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రధాన రహదారుల మరమ్మతు పనులు ఆర్ అండ్ బీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. రోడ్లన్నీ గుంతల మయం కావడంతో ప్రజలు అనేకసార్లు గగోలు పెట్టారు. విషయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో మరమ్మతు పనులు అధికారులు వేగంగా చేపట్టారు.