దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యాం సీపేజ్

ELR: గత పది రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. దీంతో ఎగువ కాఫర్ డ్యాంలో కొంత భాగం పాడైనట్టు తెలుస్తోంది. 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యాంకు డ్యామేజ్ వాటిల్లినట్టు చెబుతున్నారు. దిగువన బట్రస్ డ్యాం నిర్మాణం, ఎగువన ఎత్తు, వెడల్పు పెంచిన చోటే ఇప్పుడు కొంతమేర నిర్మాణం దెబ్బతిన్నట్టు సమాచారం.