'వాస్తవాలు దాచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు'

PLD: వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు పూర్తిగా అబద్ధపూరితమని, వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.