అనంతపల్లి సర్పంచ్‌గా సీపీఎం పార్టీ అభ్యర్థి గెలుపు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామ సర్పంచ్‌గా చిలుక బాబు ఎన్నికయ్యారు. సీపీఎం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. చిలుక బాబు ఇప్పటికి ఆరు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి విజయం వరించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.