దెబ్బతిన్న సీసీ రోడ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు

దెబ్బతిన్న సీసీ రోడ్లు.. ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు

HYD: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెనుక వీధిలో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. దీనికితోడు మురుగు కాలువలు పొంగిపొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ప్రమాదాల బారీన పడుతున్నారని మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరారు.