'ఉన్నత చదువుల కోసం కృషి చేయాలి'

'ఉన్నత చదువుల కోసం కృషి చేయాలి'

ADB: నార్నూర్ మండలంలోని మల్కుగూడ గ్రామ ఆదివాసీ యువకులు సోమవారం ఉట్నూరులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను కలిశారు. క్రీడా, ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీ మంజూరుకై కృషి చేయాలనీ కోరారు. ఆదివాసీలు చదువుల్లో వెనుకంజలో ఉన్నారని, ప్రేరణ తరగతులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కనక హన్మంతరావు, రామేశ్వర్, సంతోష్, జంగు, సందీప్ ఉన్నారు.