HYDలో..24 గంటల స్పీడ్ పోస్ట్ సేవలు
HYD: బుక్ చేసిన మరుసటి రోజే తపాలా గమ్యస్థానానికి చేరేలా 24 గంటల స్పీడ్ పోస్ట్ సేవలను HYDలో ప్రారంభించినట్లు కోఠి ట్రూప్ బజార్ హెడ్ పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. ఈ సేవతో అత్యవసర పత్రాలు వేగంగా చేరుతాయని, వినియోగదారులకు సమయాభావ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. నగరంలో తపాలా సేవలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక చర్యగా భావిస్తున్నారు.