ఓపెన్ పరీక్షలకు గైర్హాజరు ఎంత మందంటే..!
NZB: జిల్లాలో ఓపెన్ పది,ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ ఓపెన్ పదోతరగతికి జరిగిన గణితం పరీక్షకు 12 పరీక్షా కేంద్రాల్లో 2,542 మందికి గాను 2,237మంది హాజరుకాగా 305 మంది గైర్హాజరయ్యారు. 88% హాజరు నమోదైందని DEO అశోక్ వెల్లడించారు. ఓపెన్ ఇంటర్‌కు జరిగిన పొలిటికల్ సైన్స్ పరీక్షకు 15 పరీక్షా కేంద్రాల్లో 2,611 మందికి గాను 2,344 మంది హాజరు అయ్యారు.