‘గ్రూప్-1పై హైకోర్టు తీర్పును అమలు చేయాలి’

TG: గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌పై హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని TGPSCని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అనేక అంశాలను పరిశీలించిన హైకోర్టు.. మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆయన.. మూల్యాంకన ప్రక్రియలో TGPSC ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు.