'దెబ్బతిన్న పంటలను సర్వే చేసిన అధికారులు'

MNCL: బెల్లంపల్లి మండలం చాకెపల్లి, చంద్రవెల్లి గ్రామాలలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, వరి పంటలను మంగళవారం వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ సందర్శించి సర్వే చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. నష్టపోయి సర్వే చేయించుకోని రైతులు తమను సంప్రదించాలని AO పేర్కొన్నారు.