VIDEO: ఆదర్శ గ్రామంలో సీతారాముల కళ్యాణం
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని పూజారి శ్రీధర్ శర్మ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. BRS గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరై సీతారాముల కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి పాల్గొన్నారు.