VIDEO: పాఠశాల సమీపంలో నిప్పు పెట్టిన ఆకతాయిలు
సత్యసాయి: సోమందేపల్లి మండలం క్రీస్తుజ్యోతి పాఠశాల సమీపంలో ఆకతాయిలు బుధవారం నిప్పు పెట్టారు. మంటలు పాఠశాల వైపు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒక స్థానికుడు ధైర్యంగా ముందుకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాడు.