కెనడా పౌరసత్వ నిబంధనల్లో కీలక మార్పులు
పౌరసత్వానికి సంబంధించి కెనడా ప్రభుత్వం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కెనడా బయట జన్మించిన కెనడియన్ల పిల్లలకు అక్కడి పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. తల్లిదండ్రులు కచ్చితంగా మూడేళ్లు కెనడాలో ఉండాలన్న నిబంధన విధించింది. ఈ పౌరసత్వ చట్టంలో తీసుకొచ్చిన మార్పులు అమల్లోకి రావడంతో భారతీయ కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.