శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ ఈవో తనిఖీలు

శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ ఈవో తనిఖీలు

AP: తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ ఈవో శ్యామల రావు తనిఖీలు చేశారు. టోకెన్ల జారీలో ఆటోవాలాల దందా అంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టోకెన్ల జారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. భక్తుల దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.