భారీగా సచివాలయాల ఉద్యోగుల బదిలీలు

NLR: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఐదేళ్లు ఒకే చోట, ఒకే ప్రాంతంలో పనిచేసిన వారందరూ బదిలీ అయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. 20 రోజులుగా దరఖాస్తులను ఆహ్వానించారు. గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 533 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు.