నర్సంపేటలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

నర్సంపేటలో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

WGL: నర్సంపేట పట్టణంలో సోమవారం 1వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కర్ రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కేక్ కట్ చేసి, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.