తమటాడలో అగ్ని ప్రమాదం పూరిల్లు దగ్ధం

తమటాడలో అగ్ని ప్రమాదం పూరిల్లు దగ్ధం

VZM : బొండపల్లి మండలంలోని ముద్దూరు పంచాయతీ శివారు తమటాడ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు కాలిపోయింది. గ్రామానికి చెందిన కొందూరు రమణమ్మకు చెందిన గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రెండు లక్షల రూపాయలు ఆస్థి నష్టం సంభవించింది. అగ్నిమాపక కేంద్రం అధికారి రవిప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పారు.