చెన్నూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
MNCL: చెన్నూరులో డా. బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, కౌన్సిలర్లు గర్రెపల్లి వెంకట నర్సయ్య-శాంత రాణి, ఏతం శివ కృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.