పెద్దకడబూరులో జనాభా గణన శిక్షణ ప్రారంభం
KRNL: 2027 జనాభా గణనలో భాగంగా పెద్దకడబూరులో సచివాలయ సిబ్బందికి నేటి నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 13 నుంచి 22 వరకు నిర్వహించే ఈ శిక్షణలో ఇండ్ల జాబితా తయారీ విధానాలను మండల ఫీల్డ్ ట్రైనర్లు MRO గీతప్రియదర్శిని, MPDO ప్రభావతి దేవి వివరించారు. జనాభా గణన సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలకమని తెలిపారు. ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలన్నారు.