పరిహారం చెల్లించాలని మృతదేహంతో ఆందోళన

పరిహారం చెల్లించాలని మృతదేహంతో ఆందోళన

WGL: సంగెం మండలం కాపుల కనపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోట రాజు కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాత్రి ఆందోళన చేశారు. బైక్‌ను అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి కారణమైన ప్రభాకర్ ఇంటి ఎదట మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేశారు. పోలీసులు చర్చలు జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ మేరకు ఆందోళన విరమించారు.