కోఠి మహిళా వర్శిటీలో వేధింపుల కలకలం
HYD: కోఠి మహిళా వర్శిటీలో వేధింపుల ఘటన కలకలం రేపింది. పీజీ విద్యార్థినులు, మెస్ ఇంఛార్జ్ వినోద్ వేధింపులు గురిచేస్తున్నాడని షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆడియోలు బయటకొచ్చాయి. అతనిపై ప్రిన్సిపల్ సైతం చర్యలు తీసుకోవడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేర్లు బయటపెట్టొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు.