VIDEO: వంట గ్యాస్ సరఫరా చేయాలని సీపీఎం డిమాండ్
NZB: బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో వినియోగదారులకు వంట గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శాల గంగాధర్ డిమాండ్ చేశారు. గ్యాస్ కోసం బుకింగ్ చేసుకున్నప్పటికీ సదరు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు తహశీల్దార్, ఎస్సైకి దీనిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు.