అమిత్ షాకు మోదీ రహస్యాలు తెలుసు: కాంగ్రెస్ మంత్రి
ఢిల్లీ పేలుడు ఘటనకు కేంద్రమంత్రి అమిత్ షా కారణమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆరోపించారు. స్వతంత్ర భారతదేశంలో అత్యంత అసమర్థ హోంమంత్రి ఆయనే అంటూ విమర్శించారు. దేశంలో పదే పదే వైఫల్యాలు జరుగుతున్న అమిత్ షా ఎందుకు రాజీనామా చేయటం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రహస్యాలు అమిత్ షాకు తెలుసు కాబట్టే ఇన్ని వైఫల్యాలు జరుగుతున్న ఆయనను తొలగించటం లేదని వ్యాఖ్యానించారు.