తుర్కగూడెంలో కోతకు గురైన బీటీ రోడ్డు

KMM: కూసుమంచి మండలంలోని తుర్కగూడెం గ్రామంలో బీటీ రోడ్డు కోతకు గురైంది. మండలంలో ఆదివారం అర్థరాత్రి కురిసిన భారీ వర్షానికి తుర్కగూడెం ఎగువ నుంచి వరద రావడంతో తుర్కగూడెం-ముత్యాలగూడెం వెళ్లే రహదారి పై నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో బీటీ రోడ్డు కోతకు గురైంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు .