'రాఖీతో అనుబంధం మరింత బలపడుతుంది'

VZM: సోదర సోదరీమణుల అనుబంధానికి రాఖీ పూర్ణిమ ప్రతీక అని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కా, చెల్లమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. సోదరీమణులు సోదరుల చేతికి కట్టే రక్షా బంధనం, వారి కష్ట సుఖాల్లో తోడుగా నిలిచి రక్షణ ఇస్తుందని అన్నారు. కట్టిన ప్రతి రాఖీతో అనుబంధం మరింత బలపడుతుందన్నారు.