'ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి'

'ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి'

VZM: గంట్యాడ మండలం, మోకాలపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంకపల్లి శివ ప్రసాద్ శనివారం పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధి హామీ మహిళలతో సమావేశం జరిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చొరవ చూపి తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఆయన కోరారు.