పంపనూరు కోటి దీపోత్సవానికి పటిష్ట బందోబస్తు
ATP: ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రమణ్య స్వామి దేవస్థానంలో నిర్వహించిన కోటి దీపోత్సవం సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు రద్దీకి అనుగుణంగా డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో నిఘా కొనసాగింది.