సమ్మర్ క్యాంపులకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ

MHBD: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 33 జిల్లాల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపుల కోసం స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఇనుగుర్తి క్యాంపుకు వాలీబాల్, గార్ల క్యాంపుకు బాస్కెట్‌బాల్ మెటీరియల్‌ను క్యాంప్ ఇంఛార్జ్‌లకు అందజేశారు.