ఎస్పీ కార్యాలయంలో సత్యసాయిబాబా జయంతి
SRD: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో భగవాన్ సత్యసాయిబాబా 100వ జయంతి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. సత్య సాయిబాబా చిత్రపటానికి డిఎస్పీ సత్యయ్య గౌడ్ పూలమాల వేశారు. ఆయన మాట్లాడుతూ.. సత్య సాయిబాబా భక్తితో పాటు సేవా కార్యక్రమాలను చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా జయంతిని నిర్వహిస్తుందని పేర్కొన్నారు.