ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలకు తీవ్ర గాయాలు
WNP: పెబ్బేరు బైపాస్ వద్ద మల పల్లె గ్రామానికి చెందిన కూలీలు బోరెల్లి గ్రామానికి కూలి పనికి వెళ్తుండగా, ఆటోను కారు ఢీకొనడంతో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మం గార్లు ఆసుపత్రికి చేరుకుని, డాక్టర్లతో మాట్లాడి కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.