నిరుపయోగంగా నాన్ వెజ్ మార్కెట్
MHBD: గత ప్రభుత్వ హయాంలో తొర్రూరు మండల కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. రాత్రి వేళలో ఈ మార్కెట్ స్థలం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే ఈ మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.