VIDEO: ప్రయాణికులకు నిరుపయోగంగా టాయిలెట్లు
NTR: కంచికచర్ల మండలం చెరువు కట్ట సమీప సర్వీస్ రోడ్డులో హైవే అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. నిర్మించిన హైవే టాయిలెట్లు మూసివేయబడి ఉపయోగం లేకుండా ఉన్నాయి. సాయంత్రం వేళల్లో ప్రాంతం మందుబాబుల అడ్డాగా మారుతోంది. శివసాయి క్షేత్రం నుంచి పట్టణంలోకి వెళ్లే రోడ్డులో టాయిలెట్లు లేక మహిళలు, యువతులు భయాందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.