VIDEO: 'విభజన హామీలు అమలు చేయాలి'
KMM: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 అమలుపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో బుధవారం గళమెత్తారు. విభజన సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని కేంద్రాన్ని నిలదీశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, ఖమ్మం, పాలమూరును పట్టించుకోవాలని, అటు ఏపీలో కలిసిన 4 పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలన్నారు.