'ఎన్నికల విజయవంతంలో పోలీసు శాఖ సమన్వయం కీలకం'
ASF: జిల్లాలోని 114 గ్రామ పంచాయతీలలో పోలింగ్ శాంతియుతంగా ముగిసిందని SP నితికపంత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత 2 రోజులుగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 5 మండలాల్లో ఏరియా డామినేషన్, ఫుట్ డ్రిల్ ఎక్సర్సైజ్ విస్తృతంగా నిర్వహించామన్నారు. తొలి విడత ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా ముగియడంలో పోలీసు శాఖ సమన్వయం కీలకమైందని SP తెలిపారు.