దారుణం: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి

దారుణం: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి

KMR: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ముక్కుపచ్చలారని రెండురోజుల పసికందను ఓ తల్లి అమ్మాకానికి పెట్టింది. ఇది గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను విచారించగా.. ఆర్థిక ఇబ్బందుల వల్లే పాపను అమ్మానంటూ చెప్పుకొచ్చింది. తల్లి, శిశువును PSకు తరలించి విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.