'కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన'

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పామాయిల్ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ.. పామాయిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారికి ప్రభుత్వ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.