షాద్‌నగర్ వాసికి అమెరికాలో అపూర్వ గౌరవం
RR: షాద్‌నగర్ వాసికి అమెరికాలో అపూర్వ గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్‌గా ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ద్వారా ఆయన అమెరికా అధ్యక్షులు ట్రంప్ టీంలో ఒకరిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకత్వ పటిమ, నిజాయితీ, ప్రజాసేవను గుర్తించిన రిపబ్లికన్ పార్టీ తనను ఎన్నుకుందన్నారు.