ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ
కోనసీమ: అమలాపురం పురపాలక పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ యంత్రాంగం భారీ ఊరటనిచ్చింది. ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు బకాయిలను ఒకేసారి చెల్లించే వారికే ఈ అవకాశం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.