ప్రశాంతంగా పోలింగ్.. కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
SRPT: మూడో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. బుధవారం పాలకీడు, కోమటికుంట, కల్మెట్ తండా, రాఘవాపురం పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకీడులో 56.69 శాతం, కోమటికుంటలో 73 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.