VIDEO: యూరియా కోసం రైతన్నల అవస్థలు

MHBD: యూరియా కోసం అన్నదాత కష్టాలు రోజురోజుకూ మరి ఎక్కువైపోతున్నాయి. గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి యూరియా దిగుమతి అవుతుందని అధికారులు సమచారమిచ్చారు. ఆలస్యమైతే యూరియా దొరకదని ఆందోళనతో రైతులు సోమవారం రాత్రి సమీపంలోని దుకాణ సముదాయాల ముందు చలిలో నిద్రించారు.