నూతన SIను సన్మానించిన BRS నాయకులు
BHPL: రేగొండ మండలం నూతన SIగా బాధ్యతలు స్వీకరించిన D. సుధాకర్‌ను సోమవారం BRS పార్టీ మండల అధ్యక్షుడు దాట్ల రాజేందర్ ఆధ్వర్యంలో BRS నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.