రైతు ఆదాయం పెంపే లక్ష్యం: సిద్ధార్థ జైన్

రైతు ఆదాయం పెంపే లక్ష్యం: సిద్ధార్థ జైన్

సత్యసాయి: రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా పంటలవారీగా ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కోపరేషన్ జిల్లా నోడల్ అధికారి సిద్ధార్థ జైన్ (ఐఏఎస్) అధికారులను ఆదేశించారు. చిలమత్తూరు మండలంలో మొక్కజొన్న, మల్బరీ పంటలను పరిశీలించారు. రైతులు సాగులో ఉన్న లోపాలను గుర్తించి, విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే దిశగా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.