VIDEO: పులివెందులలో రోడ్డు ప్రమాదం.. కేసు నమోదు
KDP: పులివెందుల రాణితోపు సమీపంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఒక ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.