ఖోఖోలో తాండూరు విద్యార్థిని సత్తా
VKB: తాండూరుకు చెందిన విద్యార్థిని శ్రీలక్ష్మి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మిని ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే విద్యార్థినిని తీర్చిదిద్దిన పీఈటీలను ప్రశంసించారు.