రేపటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు

రేపటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు

AKP: పరవాడ మండలం ఈ-బోనంగి అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే నెల 16 వరకు ధనుర్మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఆలయంలో నెల గంట మోగించి ఉత్సవాలను ప్రారంభిస్తామని ప్రధాన అర్చకులు శ్రీహరి కృష్ణమాచార్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30న వైకుంఠ ఏకాదశి, వచ్చే నెల 14న గోదాదేవి కళ్యాణం జరుగుతుందన్నారు.