VIDEO: అకాల వర్షాలతో పొంగిపొర్లుతున్న జంపన్నవాగు

VIDEO: అకాల వర్షాలతో పొంగిపొర్లుతున్న జంపన్నవాగు

MLG: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని రెడ్డిగూడెం వద్ద జంపన్న వాగు పొంగిపోర్లుతుంది. భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద వచ్చి వాగులో చేరడంతో శుక్రవారం రెడ్డిగూడెం వద్ద కల్వర్టుపై నుంచి వరదనీరు ప్రవహించింది. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలతో పలు ప్రాంతాల్లో పొలాలకు నీరు లేక ఎండిపోతున్న విషయం తెలిసిందే. జంపన్నవాగులో వరద చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.