థాయిలాండ్ మాస్టర్స్ మీట్‌కు గాజువాక అథ్లెట్స్
విశాఖ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరవనున్నారు. ఈ నెల 5న (గురువారం) ప్రారంభమై 8న ఆదివారం వరకు జరిగే 30వ థాయిలాండ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ మీట్‌లో వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ సభ్యులు పాల్గొంటున్నారు. డి.వి.భాస్కరరాజు, గుడ్ల శివరామరెడ్డి, జి.సీతారామ్, డా.మంగ వరప్రసాద్ పోటీపడనున్నారు.