భ్రమరాంబ దేవస్థానంలో కన్నుల పండుగగా వరలక్ష్మీ వ్రతం

NGKL: శ్రావణమాసాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ దేవాలయంలో వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.