వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలి మృతి
KNR: సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామంలో 80 ఏళ్ల నూనె వెంకటమ్మ అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. మానసిక స్థితి సరిగా లేని ఆమె ఆదివారం రాత్రి గ్రామంలో కనిపించగా, సోమవారం మృతదేహంగా లభించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.