బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి అదానీ

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి అదానీ

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇందుకోసం గుజరాత్‌లోని ఖావ్డాలో కంపెనీ అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను నిర్మించే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ 1,126 మెగావాట్ల సామార్థ్యం, 3,530 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేయగలదు. 2026 మార్చి నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.